<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>67</hymn_number>
<lyrics>[C1]
   నూతన జీవితము కోరుము ప్రతిదినము
   మారిన మన జీవితమే యేసుకు సమ్మతము
   యేసుకు సమ్మతం

[V1]
 మాలిన్యములతో నిండిన మనస్సు
 మానవ జీవితమునకు అది తెలుపు
 మాన్యుడు యేసుని నిండిన మనస్సు
 మంచిని పెంచి వలందుకు నడుపు

[V2]
 యేసుని పలుకుల సారము గ్రోలి
 ఆకు వాడని చెట్టును పోలి
 వాక్యమనే ఖడ్గము చేబూని
 సాతానును జడియక ఎదిరించు</lyrics>
<title>నూతన జీవితము కోరుము</title>
</song>